![]() |
![]() |

మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ షోలో ఎవరు ఏ బాధ్యతలు నెరవేర్చట్లేదు ఏ బాధ్యతలు నెరవేరిస్తే బాగుంటుంది అని మీ లైఫ్ పార్టనర్స్ కోరుకుంటున్నారు అన్న అంశం మీద లవ్ గురు ఒక టాస్క్ ఇచ్చాడు. వాళ్ళు నెరవేర్చాల్సిన బాధ్యతలు ఏంటో కూడా వాళ్ళు వేసుకున్న స్పెషల్ టీ షర్ట్ మీద "ల్యాక్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ " అనే దాని కింద రాయించారు.ఐతే ఇందులో లేడీస్ అంతా హెల్త్ గ్రో చేసుకోవాలి, స్కిల్స్ గ్రో చేసుకోవాలి ఎమోషనల్ బ్యాలన్స్ మెయింటైన్ చేయాలి అంటూ వాళ్ళ వాళ్ళ హజ్బెండ్స్ రాశారు. అంతా స్మూత్ గా వెళ్ళింది కానీ వాసంతి కృష్ణన్ - పవన్ కళ్యాణ్ మధ్య చిన్న ఇష్యూ అయ్యి సీరియస్ అయ్యారు ఇద్దరూ. పవన్ కళ్యాణ్ టీ షర్ట్ మీద వాసంతి " రన్నింగ్ ది హౌస్ , పర్సనల్ గ్రోత్ " అని రాసింది. "రన్నింగ్ ది హౌస్ అనేది నీకు చాల ఇంపార్టెంట్. పెళ్ళికి ముందు నువ్వు ఎలా ఉన్నావో నాకు తెలీదు.
పెళ్లయ్యాక రన్నింగ్ ది హౌస్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను చిన్న పూజకు పూలు తెమ్మన్నా కూడా తనకు జిమ్ మాత్రమే ఇంపార్టెంట్. జిమ్ లో ఆరేడు గంటలు స్పెండ్ చేస్తాడు పూలు తెమ్మంటే యా యా తెస్తాను అంటాడు కానీ వచ్చి షాప్స్ క్లోజ్ ఐపోయాయి లంచ్ టైం కదా ఎవరూ లేరు అన్నట్టు చెప్తాడు. ఇక పర్సనల్ గ్రోత్ ఇది చాలా ఇంపార్టెంట్. నేను పెళ్లి చేసుకుని ఇప్పటికి నాలుగో ఏడు. ఈ మూడేళ్లలో ఇతను ఒక 2 సినిమాలు చేసాడు. ఆ మూవీస్ కోసం మూడేళ్లు వేస్ట్ చేసాడు. ఆ ఒక్క 2 మూవీస్ గురించి ఆలోచించుకుని నీ త్రి ఇయర్స్ కెరీర్ లో వచ్చి అవకాశాలు వదులుకోవడం నాకు నచ్చలేదు." అని చెప్పింది.
తర్వాత పవన్ కళ్యాణ్ వాసంతి టీ షర్ట్ మీద "అండర్ స్టాండింగ్ హెల్త్ రెస్పాన్సిబిలిటీ " అని రాసాడు. "నేను ఇంట్లో ఎం మాట్లాడినా ఒక వేళా ఫన్ చేసినా నువ్వు నెగటివ్ గా తీసుకుంటావ్. హెల్త్ గురించి అంటే నువ్వు డైట్ డైట్ అంటావ్ కొంచెం బిర్యానీ తింటావా కొంచెం రైస్ తింటావా అని అడిగితె నేను డైట్ లో ఉన్నా అని చెప్తుంది. డైట్ స్టార్ట్ చేసిందేమో అనుకుంటా..కానీ నైటీ వేసుకుని సైకిల్ మీద కూర్చుని చాక్లేట్ పట్టుకుని తింటూ ఉంటుంది. అది వర్కౌట్ ఆ లేదంటే డైట్ ఆ అనేది నాకు తెలీదు. షుగర్, జంక్, పానీ పూరి అంటది రోజూ ఎక్కువగా తింటది. ఫ్యూచర్ లో కిడ్స్ కి కానీ నాకు కానీ ఎఫెక్ట్ అవుతుంది నువ్వు బాగుంటేనే నేను బాగుంటాను" అన్నాడు. చాక్లెట్స్ తింటే ఎం కాదు అంటూ చెప్పింది వాసంతి. "అవుతుంది. అంటే వాసంతి ప్రోపర్ ఫుడ్ తీసుకోకుండా ఓన్లీ జంక్ ఫుడ్ మాత్రమే తింటుంది. ఇక్కడ లవ్ మాన్షన్ లో దొరకట్లేదు కాబట్టి తినట్లేదు."అని చెప్పాడు.
![]() |
![]() |